AP Govt:జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 12వ పీఆర్సీ కమీషన్ ఏర్పాటు, ఏడాది డెడ్‌లైన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 12వ పే రివిజన్ కమిషన్‌ను (పీఆర్సీ) ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఈ కమీషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీవో నెంబర్ 68ని జారీ చేసింది. అలాగే ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమీషన్‌కు డెడ్ లైన్ విధించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలు, స్థానికంగా వున్న పరిస్ధితులు , కరువు భత్యంపై అభ్యయనం చేసి సిఫారసు చేయాలని ప్రభుత్వం కమీషన్‌ను ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని 12 పీఆర్సీ కమీషన్ వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, ఉద్యోగుల కేటగిరీలు, వారి వివరాలు, ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, వారి సంఖ్య, ప్రభుత్వం చెల్లిస్తోన్న జీతభత్యాలు, నగరాలు, పట్టణాల్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ అంశాలపై కమీషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా ప్రభుత్వం వేతన సవరణలు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments