Phone ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

  • IndiaGlitz, [Monday,August 28 2023]

సమాచార మార్పిడి కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రస్తుతం మనిషి నిత్య జీవితంలో భాగమైన సంగతి తెలిసిందే. చేతిలో సెల్‌ఫోన్ వుంటే చాలు మొత్తం ప్రపంచం మన ముందుంటుంది. ఒక్క క్లిక్‌తో ఎలాంటి పనులైన చేయొచ్చు. కానీ ఇదంతా నాణెనికి ఓ వైపు మాత్రమే.. దీని కారణంగా తీవ్ర ఒత్తిడి, తీవ్ర కోపం, తీవ్ర ఆందోళన, ఒంటరితనం, నిద్రలేమి, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నారు.

రూల్స్ స్ట్రిక్ట్‌గా అమలు :

నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మొబైల్స్ వాడకాన్ని నిషేధించి. స్కూళ్లకు మొబైల్స్ తీసుకురావడాన్ని నిషేధిస్తూ మెమో జారీ చేసింది. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు సైతం గదుల్లోకి ఫోన్లు తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది. పాఠాలు బోధించేందుకు ముందు టీచర్లు తమ మొబైల్స్‌ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా .. తరగతి గదుల్లో విద్యాబోధనకు అంతరాయం కలగకుండా వుండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :

టీచర్లు , నిపుణులు, ఇతర వర్గాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పాఠశాలల్లో హెడ్‌మాస్టర్లు, ఉన్నతాధికారులు నిబంధనల అమలును పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే స్కూళ్లలో ఫోన్లు నిషేధించిన ఢిల్లీ ప్రభుత్వం :

ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం తరగతి గదుల్లో సెల్‌ఫోన్లను నిషేధించిన సంగతి తెలిసిందే. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫోన్లు వాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. క్లాస్ రూమ్‌ల్లో చదువుకునే వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

More News

NTR100 Rupees Coin:రూ.100 ఎన్టీఆర్ నాణెం విడుదల .. ఢిల్లీ ఘనంగా కార్యక్రమం, హాజరైన అన్నగారి కుటుంబం

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా

Congress:చేవేళ్లలో ప్రజా గర్జన : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ.కాంగ్రెస్.. ముఖ్యాంశాలివే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తోంది.

Kangana Ranaut:నా కెరీర్‌లో 'చంద్రముఖి 2' వంటి గొప్ప సినిమా చేయలేదు - కంగనా రనౌత్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’.

Nara Lokesh:నోరుజారిన ఫలితం : నారా లోకేష్‌పై విమర్శల వర్షం.. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ, వైసీపీ తేలిగ్గా వదలదు

తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Rahul Sipligunj :ఎమ్మెల్యేగా పోటీ అంటు ప్రచారం ... పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది.