ఫలించిన రాజమౌళీ ప్రయత్నాలు.. ‘‘ఆర్ఆర్ఆర్’’ టికెట్ రేట్ల పెంపుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అన్ని విఘ్నాలను దాటుకుని మార్చి 25న ఆర్ఆర్ఆర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు ఏపీ సర్కార్ బంపరాఫర్ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీ ముఖ్యమంత్రితో టికెట్ ధరల విషయమై చర్చించారు. ఈ క్రమంలో రాజమౌళి ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ప్రభుత్వం “ఆర్‌ఆర్‌ఆర్‌” టిక్కెట్‌ ధరలను 100 రూపాయల వరకు పెంపునకు అనుమతించింది. తద్వారా టికెట్ రేట్ల విషయంలో బెనిఫిట్ అందుకుంటున్న మొదటి తెలుగు సినిమాగా “RRR” నిలిచింది. ఇక బెనిఫిట్ షోలకు కూడా ఏపీలో మద్ధతు లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకేరోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాలను ప్రదర్శించాలని మంత్రి సూచించారు.

ఇకపోతే.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

ప్రశాంత్ కిశోర్‌తో ఇళయ దళపతి విజయ్ భేటీ.. వేదిక హైదరాబాద్, అసలేం జరుగుతోంది..?

కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాల మరణంతో తమిళ రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని భర్తీ చేసేందుకు అగ్ర కథనాయకులు కమల్ హాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగారు.

పెండింగ్ చలానాలకు మంచి రెస్పాన్స్...  ఖజానాకు ‘‘పైసా వసూల్’’

పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టేవారికి రాయితీ ఇస్తూ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం సత్ఫాలితాలను ఇస్తోంది.

ఈ సొసైటీ గెలిచినవాడి మాటే నమ్ముతుంది ... ఆకట్టుకుంటోన్న వరుణ్ తేజ్ ‘గని’ ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘‘గని’’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

సమ్మక్క- సారలమ్మలపై వ్యాఖ్యలు: చిక్కుల్లో చిన్నజీయర్ స్వామి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆదివాసీల నిరసన

ప్రముఖ ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామి చిక్కుల్లో పడ్డారు. ఆదివాసీల వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను

బిబిసి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న  ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌  మోషన్ పోస్టర్‌ విడుదల

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌  వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5.