AP Govt: రెస్టారెంట్లు, హోటళ్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్... జనాలు ఖుషీ

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్‌లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్లు, హోటల్స్ తెరిచి ఉంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.

కరోనా మహమ్మారి కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్ధితులు అదుపులోకి రావడం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మళ్లీ రాత్రి 12 గంటల వరకు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సర్కార్ వారి నిర్ణయంతో హోటల్స్, రెస్టారెంట్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా చక్కగా హోటల్స్‌, రెస్టారెంట్‌లలో రాత్రి 12 గంటల వరకు హోటల్స్, రెస్టారెంట్లలో గడపొచ్చు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు:

మరోవైపు.. దేశంలో ఇప్పుడు మళ్లీ వైరస్‌ విజృంభిస్తోంది. థర్డ్‌ వేవ్‌ తర్వాత వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు మళ్లీ వేలను దాటేశాయి.. 10 వేల వైపు కేసులు పరుగులు పెడుతున్నాయి. దీంతో దేశంలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ తప్పదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వెలుగుచూస్తోన్న కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు:

గత 10-15 రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. టెస్టింగ్‌, ట్రేసిండ్‌, ట్రీట్‌మెంట్‌ కొనసాగించాలని.. ఇన్‌ఫ్లుయెంజా వంటి అనారోగ్యా సమస్యలపై పర్యవేక్షణ పెంచాలని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.