Anganwadi: అంగన్‌వాడీలకు ప్రభుత్వం డెడ్‌లైన్‌.. కొత్త వారిని తీసుకుంటామని హెచ్చరిక..

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

అంగన్‌వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. తక్షణమే జీతాలు పెంచాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేయగా.. ఏప్రిల్ లేదా మేలో జీతాలు పెంచుతామని సర్కార్ హామీ ఇచ్చింది. అయితే దీనిపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్‌వాడీలు కోరగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో యథావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

దీనిపై సజ్జల మాట్లాడుతూ వారి సమస్య పరిష్కరించే ఉద్దేశం కాబట్టే ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపామన్నారు. అయితే వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల్లో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని గుర్తుచేశారు. వారు డిమాండ్ చేసిన వాటిలో ఒక్క జీతాల అంశమే పెండింగ్‌లో ఉందని.. అది కూడా వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పామన్నారు. అంగన్‌వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్‌ చేస్తున్నామని.. టీచర్లకు రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్లు రూ.1.50లక్షలకు.. హెల్పర్లకు రూ.50వేలు పెంచామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. కానీ ఈ సమ్మె వెనుక పక్కా రాజకీయ ఎజెండా ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో పడి నష్టపోవద్దని సూచించారు.

అలాగే అంగన్‌వాడీలపై పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఆయన పేర్కొన్నారు. గర్భిణీలు, పసి బిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారిపై ఎస్మా ప్రయోగించాలమని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం మాట విని వెంటనే అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ అవసరాల కోసం కొత్తవారిని నియమించుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాల దృష్ట్యా తప్పదని వెల్లడించారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం దాదాపు నెలన్నర రోజుల నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. పలు విడతలుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు వారిపై ఎస్మా చట్టం ప్రయోగిస్తోంది. మరి ఈ సమస్య ఎటు వైపునకు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి.

More News

YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇటు పరిపాలనతో పాటు

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు ఢిల్లీ, విదేశాల పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఏఐసీసీ సమావేశంలో పాల్గొడంతో పాటు అగ్రనేతలతో భేటీ కానున్నారు.

Atal Setu: దేశంలోనే అతి పెద్ద వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెన 'అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింగ్(MTHL)ను జాతికి అంకితం చేశారు.

వైసీపీ మూడో జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం

సామాజిక న్యాయమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్.. అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నారు.

పందెంకోడి వేలంలో సూపర్ ట్విస్ట్.. వేలం ఆపాలని ఓ వ్యక్తి విజ్ఞప్తి..

ఆర్టీసీ అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఓ వ్యక్తి ఆ కోడి తనదే వేలం ఆపాలని కోరాడు. అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.