అత్యంత ఖరీదైన మోసాలలో ఏపీ ఫస్ట్: ఎన్‌సీఆర్‌బీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆర్థిక నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉండగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2019 నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన మోసాల విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఉదాహరణకు.. 3,675 కేసుల్లో 302 ప్రాపర్టీ లాస్ కేసులున్నాయి. వీటిలో ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ అనేది రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ జరిగినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలతో పోల్చితే.. రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య నాలుగు కేసులు మాత్రమే ఉన్నాయి.
క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘనకు సంబంధించిన కేసుల విషయానికి వస్తే.. ఏపీ రూ.5 కోట్ల నుంచి 100 కోట్ల వరకూ నష్టాలను చవిచూసింది. 30 కేసుల్లో ఆస్తి నష్టం కోటి రూపాయల నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంది. 37 శాతం కేసుల్లో ఆస్తి నష్టం లక్ష రూపాయల కన్నా తక్కువ కాగా.. 10 లక్షల మధ్య ఆస్తి నష్టం జరిగింది. మొత్తమ్మీద ఏపీకి 332 కేసులు వచ్చాయి. స్కామ్ మొత్తం కొన్ని పదుల కోట్లు ఉంది. ఖరీదైన మోసాల విషయంలో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. అయితే మహారాష్ట్ర జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఏపీ కంటే ఇక్కడ 97 శాతం తక్కువ కేసులుండటం గమనార్హం.
2018 లో రూ .50 కోట్ల నుంచి రూ .100 కోట్ల పరిధిలో మహారాష్ట్రలో ఒక్క కుంభకోణం కూడా నమోదు కాలేదు. అయితే, ఒక చీటింగ్ కేసు మాత్రం నమోదైంది. ఇందులో ఆస్తి నష్టం రూ .100 కోట్లకు పైగా ఉంది. ఇకపోతే 2016 నుంచి.. రాష్ట్రంలో వైట్ కాలర్ నేరాలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఎన్‌సీఆర్‌బీ నివేదికలో 2019లో వైట్ కాలర్ నేరాలు అత్యధికంగా 26% పెరిగాయి. దేశ ఆర్థిక నేరాలలో ఆంధ్రప్రదేశ్ 5.3% వాటా కలిగి ఉండటం గమనార్హం. నేరాల రేటు 16.8% ఉంది.
రాష్ట్రంలో 88% ఆర్థిక నేరాలు చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్‌లకు సంబంధించినవే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout