Buggana Rajendranath Reddy:ఉద్యోగుల సంక్షేమానికి జగన్ ‘‘గ్యారెంటీ’’.. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రసంగం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఉద్యోగుల పక్షపాతినని నిరూపించుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఉద్యోగులకు అత్యంత కీలకమైన బిల్లులను వైసీపీ ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. వీటిలో జీపీఎస్ బిల్లు, ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లులు వున్నాయి. అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. పాలనలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు కూడా తమ అభిమతం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని.. అలాంటి పబ్లిక్ సర్వెంట్స్ కష్టాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆర్ధిక మంత్రి అన్నారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని.. తమ ప్రభుత్వం 11వ పీఆర్సీ కమీషన్ సిఫారసులను అమలు చేసిందని, అంతకంటే ముందే ఐఆర్ ప్రకటించిందని బుగ్గన గుర్తుచేశారు.
ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం :
ఇకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ద్వారా ప్రభుత్వంపై ఏటా అదనంగా దాదాపు రూ.311 కోట్ల మేర భారం పడుతుందన్నారు. అలాగే జీపీఎస్ అమలు ద్వారా 2040 నాటికి రూ.2,500 కోట్లు అదనంగా భారం పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీము (ఓపీఎస్)ను అమలు చేస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై తీవ్ర ప్రభావం చూపుందనే ఉద్దేశంతో.. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మేలు చేసేలా గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్)ను తెచ్చిందని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వున్న న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా 2023 నుంచి 2050 నాటికి పెన్షన్ల చెల్లింపులు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటే అదే ఓపీఎస్ ప్రకారమైతే అది రూ.18 లక్షల కోట్లకు చేరుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. పాలన నిర్వహించేటప్పుడు ప్రస్తుత పరిస్ధితిని, భావితరాల పరిస్ధితిని కూడా చేసుకోవాలని బుగ్గన హితవు పలికారు.
రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట :
ఉద్యోగ విరమణ చేసిన వారు సైతం తమ కుటుంబ సభ్యులే అని భావించే సీఎం వైఎస్ జగన్ వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. పదవీ విరమణ చేసిన తరువాత సైతం వారితోబాటు ఉద్యోగుల కుటుంబీకులకు కూడా ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని బుగ్గన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతోబాటు ఆరోగ్య శాఖలో వేలకొద్దీ ఉద్యోగాలు నియమించడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం వంటి గొప్ప నిర్ణయాలన్నీ తీసుకున్నామన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ :
ఇకపోతే.. 2014, జూన్ 2వ తేదీ కన్నా ముందు నియమితులై ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 11,633 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీం(ఏపీజీపీఎస్) అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ సిస్టం బిల్లు– 2023కు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఈ జీపీఎస్ ప్రయోజనాలు ఇవీ
1. గ్యారెంటీగా పెన్షన్
2. కుటుంబానికి భద్రత
3. ఆరోగ్యభద్రత
4. జీవిత బీమా
5. మినిమం పెన్షన్
ఈ జీపీఎస్ తో బాటు రిటైర్ అయిన ఉద్యోగుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్ . దీని ప్రకారం..
ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి.
రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలకు ఆరోగ్య శ్రీ వర్తింపు.
రిటైర్ అయిన తర్వాత పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ప్రయోజనాలు అందేలా చర్యలు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments