ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్2లో ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరయ్యారు. వారిలో 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి సురేష్ తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరయ్యారు. వారిలో 9,616 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
కాగా.. ఇంజనీరింగ్‌లో 84.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 91.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగింది. కాగా.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు సైతం ఉండటం విశేషం. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. కాగా.. ఈ నెల 14న వెబ్ సైట్లో ర్యాంక్ కార్డ్స్‌ను అప్లోడ్ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
ఇంజనీరింగ్‌లో టాపర్స్ వీరే..
మొదటి ర్యాంక్ : వావిలపల్లి సాయినాథ్, విశాఖపట్నం
రెండో ర్యాంక్ : కుమార్ సత్యం, హైదరాబాద్
మూడో ర్యాంక్ : గంగుల భువన రెడ్డి, కడప
నాలుగో ర్యాంక్ : మొర్రెడ్డిగారి లికిత్ రెడ్డి, రంగారెడ్డి, తెలంగాణ
ఐదవ ర్యాంక్ : చాగారి కౌషల్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్, తెలంగాణ
ఆరో ర్యాంకు - కె.వి.దత్త శ్రీహర్ష, రాజమహేంద్రవరం)
ఏడో ర్యాంకు - వారణాసి సాయితేజ, రంగారెడ్డి
ఎనిమిదో ర్యాంకు - హార్దిక్ రాజ్‌పాల్, రంగారెడ్డి
తొమ్మిదో ర్యాంకు - కొత్తకోట కృష్ణసాయి, శ్రీకాకుళం
పదో ర్యాంకు - లండ జితేంద్ర, విజయనగరం
అగ్రికల్చరల్ & మెడిసన్‌లో టాప్ ర్యాంకర్స్
మొదటి ర్యాంక్ : గుత్తి చైతన్య సింధూ, తెనాలి
రెండో ర్యాంక్ : త్రిపురనేని లక్ష్మీ సాయి మూర్తి, తాడికొండ, గుంటూరు
మూడో ర్యాంక్: వి.మనోజ్ కుమార్, తిరుపతి చిత్తూరు
నాలుగో ర్యాంక్ : దార్సి విష్ణు సాయి, నెల్లూరు
ఐదవ ర్యాంక్ : ఆవుల సుబాంగ్, రంగారెడ్డి, తెలంగాణ
ఆరో ర్యాంకు - సింగిరెడ్డి అవిష్రెడ్డి, మేడ్చల్)
ఏడో ర్యాంకు - ఎర్రగుడి లిఖిత, కడప
ఎనిమిదో ర్యాంకు - జడ వెంకట వినయ్, కడప
తొమ్మిదో ర్యాంకు - సోగనూరు నితిన్ వర్మ, కర్నూలు
పదో ర్యాంకు - మురికిపూడి రేవంత్, గుంటూరు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout