సోషల్ మీడియా యూజర్స్‌కు ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని యూజర్స్‌కు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మీడియాతో మాట్లాడిన డీజీపీ.. సోషల్ మీడియాలో ప్రచారం చేసే వార్తలు అవాస్తవాలైతే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వంపై గానీ, ప్రభుత్వ అధికారుపై గానీ కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మరీ ముఖ్యంగా.. అనుమతి లేకుండా సోషల్ మీడియాలో మహిళల ఫొటోలు షేర్ చేసినా.. అసభ్య పదజాలం వాడినా శిక్ష తప్పదన్నారు.
పోస్ట్ చేసి డెలీట్ చేసినా..
ఎవర్నయినా వ్యక్తిగతంగా దూషించినా, క్రిమినల్ పేర్లు సంభోదిస్తూ పేర్లను పెట్టినా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎవరిపై అయినా కించపరుస్తూ పోస్ట్‌లు చేసి.. ఆ తర్వాత డిలీట్ చేసినా సరే కేసులు కచ్చితంగా పెడతామన్నారు. ఎందుకంటే.. డిలీట్ చేసిన పోస్ట్‌లు, మెసేజ్‌లను గుర్తించే టెక్నాలజీ తమ వద్ద ఉందని ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ తేల్చిచెప్పారు. ఇది కేవలం ట్విట్టర్, ఫేస్‌బుక్‌కు మాత్రమే కాదు.. వాట్సప్‌కు కూడా ఇది వర్తిస్తుందన్నారు. గ్రూపులోని మెంబర్స్ చేసే పోస్టులకు అడ్మిన్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని డీజీపీ స్పష్టంగా వివరించారు.
100, 112 ఉపయోగపడ్డాయ్..!
‘పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకెళ్తున్నాం. పోలీస్‌శాఖలో తొలిసారిగా వీక్లీఆఫ్ కల్పించాం. 95శాతం సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాం. స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గింది. 4లక్షల మంది దిశ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయి. టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నాం. విజయవాడ పటమట గ్యాంగ్ వార్ ఘటన దురదృష్టకరం.. వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయి’ అని గౌతమ్ సవాంగ్ మీడియా వేదికగా హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments