సినిమాల్లోకి ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి!

  • IndiaGlitz, [Monday,September 23 2019]

టైటిల్ చూడగానే ఇదేంటి.. డిప్యూటీ సీఎం సినిమాల్లోకి వస్తున్నారా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. పుష్పశ్రీవాణి సినిమాల్లో నటిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయ్యుండి సినిమాల్లోకి ఏం చేస్తారు..? అసలు ఈమె ఎందుకు సినిమాల్లోకి రావాలని.. నటించాలని భావిస్తున్నారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా ‘అమృత భూమి’ అనే సినిమాను తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టీచర్‌ పాత్రలో పాముల పుష్పశ్రీవాణి నటిస్తున్నారు. కలెక్టర్ హరిజవహర్‌లాల్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. విజయనగరంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో తాజాగా షూటింగ్ జరిగింది. ఈ చిత్రీకరణలో భాగంగా మొదట పుష్పశ్రీవాణి పాత్రకు సంబంధించి షూట్ చేశారు. ఈ షూటింగ్ గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరిగింది.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందదాయకమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నటకిరీటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రోజు రోజుకీ అటవీప్రాంతం అంతరించి పోతోందని, తినే తిండి గింజల నుంచి కట్టుకునే బట్ట వరకు అంతా రసాయనాలతో నిండిపోతుందని.. అందుకే రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వాస్తవానికి ఈమె పెళ్లి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు టీచర్‌గానే పనిచేస్తుండేవారు. ఆ తర్వాత ఈమె పెళ్లి చేసుకోవడం.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అన్నీ చకాచకా జరిగిపోయాయి.

More News

అజయ్‌కు రవితేజ ‘నో’ చెప్పడానికి కారణమిదేనట

‘ఆర్ ఎక్స్100’ సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి పేరు ఈ మధ్య అస్తమాను వార్తల్లో వినపడుతోంది.

అల‌.. బ‌న్నీ డేట్ ఫిక్స్‌

స్టైలిష్ స్టార్ తాజా చిత్రం `అల..వైకుంఠ‌పుర‌ములో..`  చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు.

ఎన‌ర్జీలో అన్న‌య్య‌ని కొట్టేవాడు పుట్ట‌డు: పూరి జ‌గ‌న్నాథ్‌

భారీ అంచ‌నాలు న‌డుమ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది.

విఠల్ వాడి సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నటుడు జగపతిబాబు

ఎన్.ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 విఠల్ వాడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు జగపతిబాబు విడుదల చేశారు.

క్వశ్చన్ పేపర్ లీకేజి ఫ్యామిలీ ప్యాకేజిగా మారింది!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామ సచివాలయ పరీక్షా ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.