ఢిల్లీకి వెళ్లింది నిజమే కానీ...: ఏపీ డిప్యూటీ సీఎం సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా ఢిల్లీలోని నిజాముద్ధీన్ ప్రాంతంలో జరిగిన మర్కాజ్ సమావేశాలకు వెళ్లారని.. ఆ మరుసటి రోజే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారని మంగళవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ఓ మీడియా సంస్థలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి..? ఇంతకీ ఆయన వెళ్లారా లేదా..? అనేదానిపై ఎంతకీ క్లారిటీ రాకపోవడంతో ఓ వైపు వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. అయితే.. ఎట్టకేలకు అంజాద్ మీడియా ముందుకు క్లారిటీ ఇచ్చేశారు.
ఢిల్లీకి వెళ్లింది నిజమే కానీ..
తనపై ఓ మీడియా సంస్థ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని తీవ్ర స్థాయిలో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఆ సంస్థపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఆయన.. పరువు నష్టం దావా వేయడానికి కూడా సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ‘నేను ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమే. కానీ మర్కజ్ సమావేశాలకు కాదు. మార్చి-02, 3న విజయవాడ వచ్చాను. డిప్యూటీ సీఎం హోదాలో నాకు ప్రోటోకాల్ ఉంది. నేను ఎక్కడి వెళ్లినా.. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి ఒక్కటీ రికార్డు అవుతాయి. ఢిల్లీలో కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు కేసుపై వెళ్లడం జరిగింది. మార్చి- 5 నుండ 26 వరకు కడపలోనే ఉన్నానను. గత నెల 14,15,16 తేదీల్లో జిల్లాలో టీడీపీ నేతలు వైసీపీలో చేరిన కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను’ అని అంజాద్ బాషా క్లారిటీ ఇచ్చుకున్నారు.
నిరూపిస్తా.. చానెల్ మూసేస్తారా!?
‘నాపై దుష్రచారం చేస్తున్న మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేస్తాను. ప్రభుత్వం తరపున నుండి కూడా ఆ ఛానెల్ పై చర్యలు తీసుకుంటామం. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నాపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య. ఒకవేళ నేను ఢిల్లీ సభలకు వెళ్లలేదు అని నేను నిరూపిస్తే.. మీ మీడియా సంస్థను మూసేస్తారా..?. మార్చి 27న విజయవాడలో క్యాబినెట్ మీటింగ్‌కు హాజరైన మాట వాస్తవమే. జగన్‌తో భేటీ అనంతరం నేను గత నెల 28న ఇంటికి కడపకు వచ్చాను. మళ్ళీ 28న కడప వచ్చాను. అంతకు మించి నేను ఎక్కడికి వెళ్లలేదు’ అని డిప్యూటీ సీఎం క్లారిటీగా చెప్పారు. మొత్తానికి చూస్తే అంతా ఓకే అన్న మాట. అంజాద్ క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానుల్లో నెలకొన్న ఆందోళన.. టెన్షన్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout