ఏపీలో 53 వేలు దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..
- IndiaGlitz, [Monday,July 20 2020]
ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆదివారంతో పోలిస్తే నేడు కొంచెం కరోనా కేసులు తగ్గాయి. నిన్న ఐదు వేల కేసులు నమోదవగా.. నేడు నాలుగు వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33,580 మందికి పరీక్షలు నిర్వహించగా 4074 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,724కు చేరుకుంది. కాగా నేడు 54 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 696కు చేరుకుంది.
నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. నేడు ఏకంగా 1086 కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కడప, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కాగా నేటి వరకూ రాష్ట్రంలో 13,49,112 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 20/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 20, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 50,829 పాజిటివ్ కేసు లకు గాను
*21,664 మంది డిశ్చార్జ్ కాగా
*696 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 28,469#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0WtQhBgekN