ఏపీలో 53 వేలు దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Monday,July 20 2020]

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆదివారంతో పోలిస్తే నేడు కొంచెం కరోనా కేసులు తగ్గాయి. నిన్న ఐదు వేల కేసులు నమోదవగా.. నేడు నాలుగు వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33,580 మందికి పరీక్షలు నిర్వహించగా 4074 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,724కు చేరుకుంది. కాగా నేడు 54 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 696కు చేరుకుంది.

నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. నేడు ఏకంగా 1086 కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కడప, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కాగా నేటి వరకూ రాష్ట్రంలో 13,49,112 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

నా పెళ్లికి రండి: కేసీఆర్‌కు నితిన్ ఆహ్వానం

ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ కరోనా ఎందరో ఆశలపై నీళ్లు జల్లింది.

వెబ్ సిరీస్ ఆలోచ‌న‌ల్లో సందీప్ వంగా..?

తొలి చిత్రం `అర్జున్ రెడ్డి`తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.

మ‌ణిర‌త్నం ‘న‌వ‌ర‌స‌’లో టాలీవుడ్ స్టార్స్‌..?

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించే ప్ర‌య‌త్నాల్లో

రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొత్త‌గా ఆలోచించాలి:  ఆర్జీవీ

రాజమౌళి క్రియేటివిటీ వల్ల ఆయ‌న పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అయ్యారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

పండ‌గ పందెంలో నితిన్‌..?

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’ చిత్రంతో