ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్షన్నర దాటేశాయి. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో నాలుగు రోజుల పాటు 10 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం మాత్రం కొత్తగా 9,276 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరాయి. కరోనాతో నేడు 58 మంది మృతి చెందగా.. మొత్తంగా 1407 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 72,188 యాక్టివ్ కేసులున్నాయి.

నేడు ఒక్కరోజే 12,750 మంది కరోనా కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకూ 76,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు కరోనాతో తూర్పు గోదావరిలో 8 మంది, విశాఖలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, అనంతలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు.