ఏపీలో మోగిన ఉప ఎన్నిక నగారా..

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

ఏపీలో ఉప ఎన్నిక నగారా మోసింది. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఖాళీ స్థానాన్ని భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఈసీ చేసింది.. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఆగస్టు 13 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 24 పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ఉండనున్నాయి.