చిన్న కుమార్తె అడ్మిషన్ కోసం అమెరికాకు వైఎస్ జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి జగన్.. అమెరికా వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగన్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా.. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ఆగస్ట్ 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో సీఎం ప్రసంగించనున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లునున్నారు.
ఈ సందర్భంగా.. చిన్న కుమార్తె వర్షా రెడ్డిని ఉన్నత విద్య కోసం అమెరికాలోని ఓ విద్యాసంస్థలో చేర్చుతున్నారని సమాచారం. అడ్మిషన్ ప్రక్రియ కోసం ఆయన అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇండియానా స్టేట్లోని ప్రతిష్ఠాత్మక ‘నోట్రెడామ్ యూనివర్శిటీ’లో వర్షా రెడ్డికి సీటు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆమె ఆ యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. కాగా గురువారం రాత్రి.. రాత్రి 9.30 గంటలకు జగన్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. పర్యటన ముగించుకుని ఈ నెల 24న రాష్ట్రానికి జగన్ తిరిగి వస్తారు. ఇప్పటికే ఆయన పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రస్తుతం లండన్లోని ప్రతిష్ఠాత్మక ‘లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో విద్యను అభ్యసిస్తున్న విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments