Bhumana Karunakar Reddy : వైవీ సుబ్బారెడ్డిని తప్పించనున్న జగన్.. టీటీడీ కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి..?
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం అయినవారినైనా సరే పక్కనబెట్టాలని నిర్ణయించారు. జగన్‌ను దగ్గర నుంచి చూసిన వారికి ఆయన వ్యవహారశైలి బాగా తెలుసు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణను గమనిస్తే ఈ విషయం బాగా అర్ధమవుతుంది. తనకు అత్యంత ఆప్తులైనా సరే .. పార్టీ కోసం అవసరమైతే త్యాగం చేయాల్సిందేనని జగన్ సంకేతాలు పంపారు. తాజాగా తన చిన్నాన్న, పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే వున్న వైవీ సుబ్బారెడ్డిని సైతం తప్పించేందుకు ఆయన వెనుకాడటం లేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని టీటీడీ పాలకమండలిని ప్రక్షాళన చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పర్వదినాలు ముగిసిన తర్వాత కొత్త పాలకమండలి బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది.
వైసీపీని అధికారంలోకి తెచ్చిన ఉత్తరాంధ్ర:
వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డ్ పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగియనుంది. 2019 జూన్ 22 న తొలిసారి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డికి మరోసారి ఈ పోస్ట్‌ను రెన్యువల్ చేశారు. అయితే అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ కార్యకలాపాలను వైవీ సుబ్బారెడ్డి చూస్తున్న నేపథ్యంలో.. ఆయన సేవలు వచ్చే ఏడాదిన్నర కాలం జగన్‌కు కీలకం కానున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రపై మరింత దృష్టి పెట్టేందుకు గాను సుబ్బారెడ్డిని వ్యూహాత్మకంగానే టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించినట్లుగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా వుండే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలిచింది. ఆ పట్టు సడలకుండా వుండేందుకు గాను సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
కొత్త ఛైర్మన్ రేసులో భూమన కరుణాకర్ రెడ్డి:
అంతా బాగానే వుంది కానీ..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌కు కాబోయే కొత్త ఛైర్మన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ వర్గాలు చెబుతున్న దానిని బట్టి .. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భూమనకు గతంలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం వుంది. ఇదే సమయంలో పల్నాడు జిల్లా గురజాలకు చెందిన , బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరు కూడా టీటీడీ ఛైర్మన్ రేసులో వినిపించింది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఈయన వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం వల్ల తాము బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను జగన్ పంపాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి భూమన, జంగా లలో జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout