YS Jagan:ఏపీలో వరద బీభత్సం : బాధితులకు జగన్ భరోసా, కుటుంబానికి రూ.2 వేలు ఆర్ధిక సాయం.. మరో పదివేలు కూడా
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన వారికి ఆయన అండగా నిలిచారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని తిరిగి ఇళ్లకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలని అధికారులను జగన్ ఆదేశించారు. అలాగే దెబ్బతిన్న ఇళ్ల మరమ్మత్తుల నివాసం రూ.10 వేల చొప్పున అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పంట నష్టం నమోదు చేసి రైతులను ఆదుకోండి :
వర్షాలు , వరదాలపై శుక్రవారం జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపు బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో కందిపప్పు, పామాయిల్ అందజేయాలని సూచించారు. అలాగే పంటల నష్టం వివరాలు నమోదు చేసుకుని రైతులకు అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం :
గర్భవతులు, బాలింతల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. పీహెచ్‌సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో అవసరమైన ముందులను సిద్ధంగా వుంచుకోవాలని సీఎం సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రేపు 50 అడుగులకు పైగా చేరే అవకాశం వున్నందున అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్ జగన్ అప్రమత్తం చేశారు. 42 మండలాల్లో 458 గ్రామాలను అప్రమత్తం చేశామని ఈ సందర్బంగా జగన్‌కి అధికారులు వెల్లడించారు. గోదావరికి ఆనుకుని వున్న గ్రామాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని.. ముందు ప్రాంత అధికారులను సహాయక శిబిరాలకు పంపించామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments