జగనన్న విద్యాదీవెన... విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన జగన్

‘జగనన్న విద్యాదీవెన’ పథకం నగదును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. తల్లుల ఖాతాల్లో జమచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. చదువులకు పేదరికం అడ్డు కాకూడదని.... చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. అర్హులైన అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వంలోని బకాయిలు రూ.1,778 కోట్లు కూడా చెల్లిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2021 అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ప్రభుత్వం రూ.10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేసినట్లు జగన్‌ తెలిపారు. ఈ పథకం కింద విద్యా సంవత్సరంలో మూణ్నెళ్లు పూర్తయిన వెంటనే ఆ కాలానికి సంబంధించిన బోధనా రుసుముల్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు సీఎం గుర్తుచేశారు. ఏపీలో ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని సీఎం జగన్‌ తెలిపారు. నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పారు. ఒక గ్రామం నుంచి ఒకరు డాక్టరు అయితే కుటుంబం మాత్రమే కాదు, ఊరు కూడా బాగుపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనల కోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.9,274 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని... తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశామని జగన్ పేర్కొన్నారు.

More News

కోవిడ్‌పై పోరు.. ఇవాళ్టీ నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం మరో ముందడుగు వేసింది.

కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ... 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామా చేయాలని సోనియా ఆదేశం

5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిద్రలేచింది. ఈ మేరకు పార్టీ ప్రక్షాళనకు ఉపక్రమించింది.

ఓటీటీ బిజినెస్‌లోకి షారుఖ్ ఖాన్.. యాప్ పేరేంటో తెలుసా..?

మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు.

రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఉక్రెయిన్‌లో తనకు సెక్యూరిటీగార్డ్‌గా వున్న వ్యక్తికి ఆర్ధిక సాయం

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ పెద్ద మనసు చాటుకున్నారు. యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లో తన తెలిసిన వ్యక్తికి ఆయన ఆర్ధిక సాయం చేశారు.

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ .. ఎవరెవరంటే..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.