AP CM YS Jagan:జగనన్న విదేశీ విద్యా దీవెన : కాసేపట్లో లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనున్న జగన్

  • IndiaGlitz, [Thursday,July 27 2023]

పేద విద్యార్ధులు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’’ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధులకు రూ.1.25 కోట్ల వరకు .. ఇతరులకు రూ.కోటి వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు జగన్. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్ధులు రూ.45.53 కోట్లు అందుకోనున్నారు.

టీడీపీ హయాంలో అరకొరగా సాయం:

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.15 లక్షలు, ఇతరులకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. అంతేకాదు.. ఈ ఫీజును కూడా చాలా మందికి చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి 3,326 మంది విద్యార్ధులకు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి.. తర్వాత పథకాన్ని ఎత్తివేసింది. జగన్ పగ్గాలు అందుకున్న తర్వాత విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులందరికీ ఫీజులు చెల్లించేలా ‘‘జగనన్న విదేశీ విద్యా ’’ పథకాన్ని రూపొందించారు.

రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక :

ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషణ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 50 యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్ధులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 4 వాయిదాల్లో స్కాలర్‌షిప్స్ మంజూరు చేస్తున్నారు. గడిచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’’ కింద రూ.65.48 కోట్ల ఆర్ధిక సాయం అందించారు.

More News

Pawan:పవన్ చెప్పింది నిజమే .. ఏపీలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం, లెక్కలతో సహా బయటపెట్టిన కేంద్రం

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్ర సందర్భంగా

Pooja Hegde:సోషల్ మీడియాలో పిచ్చి కూతలు .. అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజా హెగ్డే

ఎప్పుడూ సైలెంట్‌గా, నవ్వుతూ, తన పని తాను చేసుకుపోయే హీరోయిన్ పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sundari:హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ప్రేమ్ కుమార్’ నుంచి ‘సుంద‌రీ’ సాంగ్ రిలీజ్‌

‘ సుంద‌రీ.. ఓ క‌న్నే.. నీ వైపే న‌న్నే

Tirumala:దంచికొడుతున్న వానలు.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, దర్శనం ఇంత వేగంగానా..?

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్నిరోజులుగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు,

Pawan Kalyan:మా వదిన నాకు ద్రోహం చేసింది .. ఆవిడ వల్లే ఇలా : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

తాను హీరో అవ్వడానికే మా వదినే కారణమన్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ . సముద్రఖని దర్శకత్వంలో