పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ బాసట.. అన్నదాతల ఖాతాల్లోకి రూ.542 కోట్లు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు వారందరికీ ఈరోజు సీఎం వైఎస్ జగన్ ఇన్‌పుట్ సబ్సిడీని అందజేశారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి ఆయన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2021 నవంబర్‌లో వర్షాలు, వరదలకు రైతులు పంటల్ని నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద సాయం అందిస్తున్నామని.. నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టం ఏర్పడిందని జగన్ చెప్పారు. 5,79,311 మంది రైతులకు రూ.542 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామని.. 1,220 రైతు గ్రూపులకు యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తంగా ఇవాళ రూ.571కో ట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని.. గత ఖరీఫ్‌లో రూ.1800 కోట్లు బీమా కింద ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. వివిధ కారణాలతో గతంలో ఇవ్వాల్సిన రూ.93 కోట్లు ఇవ్వలేకపోయామని.. వాటిని కూడా ఈరోజు విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు జరుగుతున్నాయని సీఎం అన్నారు. యంత్రసేవా పథకం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నామని... వైఎస్సాఆర్ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకాల ద్వారా రెండున్నరేళ్ల కాలంలో రైతన్నకు అండగా నిలిచాని జగన్ గుర్తుచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments