పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ బాసట.. అన్నదాతల ఖాతాల్లోకి రూ.542 కోట్లు విడుదల

రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు వారందరికీ ఈరోజు సీఎం వైఎస్ జగన్ ఇన్‌పుట్ సబ్సిడీని అందజేశారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి ఆయన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2021 నవంబర్‌లో వర్షాలు, వరదలకు రైతులు పంటల్ని నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సాయం అందిస్తున్నామని.. నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టం ఏర్పడిందని జగన్ చెప్పారు. 5,79,311 మంది రైతులకు రూ.542 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని.. 1,220 రైతు గ్రూపులకు యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తంగా ఇవాళ రూ.571కో ట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని.. గత ఖరీఫ్‌లో రూ.1800 కోట్లు బీమా కింద ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. వివిధ కారణాలతో గతంలో ఇవ్వాల్సిన రూ.93 కోట్లు ఇవ్వలేకపోయామని.. వాటిని కూడా ఈరోజు విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు జరుగుతున్నాయని సీఎం అన్నారు. యంత్రసేవా పథకం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నామని... వైఎస్సాఆర్‌ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకాల ద్వారా రెండున్నరేళ్ల కాలంలో రైతన్నకు అండగా నిలిచాని జగన్ గుర్తుచేశారు.

More News

చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ స్కామ్‌లో దోషిగా నిర్ధారణ, మరోసారి జైలుకు తప్పదా..?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

జగన్ వద్దకు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా, ఇండస్ట్రీ చూపంతా అటే

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై గత వారం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖల బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘‘కళావతి’’.. మేకింగ్ కోసం అంత ఖర్చా..?

మారుతున్న కాలానికి తగ్గట్టుగా చిత్ర పరిశ్రమలోనూ రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

'రాధే‌శ్యామ్' వాలంటైన్స్ డే గ్లింప్స్ : ‘‘ఇంకా పెళ్ళెందుకు కాలేదు’’.. పూజ ప్రశ్నకు ఇబ్బందిపడ్డ ప్రభాస్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్.

మరో 54 యాప్స్‌పై బ్యాన్ .. చైనాకు గట్టి స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమైన ఇండియా

ఇండో చైనా బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డ్రాగన్‌కు షాకివ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.