YS Jagan: విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్న జగన్.. ఈ పదిరోజుల్లో కీలక ఘటనలు
Send us your feedback to audioarticles@vaarta.com
పది రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రుల బృందం మంగళవారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొన్న సీఎం జగన్.. తర్వాత, కుటుంబంతో కలిసి విదేశాల్లో గడిపారు. దాదాపు 10 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు.
కోనసీమలో హింసాత్మక ఘటనలు:
అయితే, జగన్ రాష్ట్రంలోని లేని ఈ 10 రోజుల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ వేలాది మంది అమలాపురంలో విధ్వంసం సృష్టించారు. ఏకంగా మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టి, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్:
అలాగే, ఒంగోలులో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నిర్వహించిన ‘మహానాడు’ సైతం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మరోవైపు రాష్ట్ర కేబినెట్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, ఆయా వర్గాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో 10 రోజుల తర్వాత రాష్ట్రానికి చేరుకున్న జగన్.. రాజకీయ, సామాజిక పరమైన అంశాలపై దృష్టిసారించనున్నారు. మంత్రులు, అధికారులను పిలిపించి రివ్యూ చేసే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout