YS Jagan : సూపర్‌స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి... మహేశ్‌ను ఓదార్చిన ఏపీ సీఎం
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం.. నేరుగా పద్మాలయా స్టూడియోకు చేరుకున్నారు. అనంతరం సూపర్‌కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ కుమారుడు మహేశ్‌ను జగన్ ఓదార్చారు.
కృష్ణ మరణం షాక్‌కు గురిచేసింది : తమిళిసై
అంతకుముందు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కూడా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళులర్పించారు. బుధవారం ఉదయం పద్మాలయా స్టూడియోకు చేరుకున్న ఆమె కృష్ణ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం వుంచి అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. కృష్ణ మరణం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను మరువ లేవమన్నారు తమిళిసై.
ఎన్టీఆర్, కృష్ణలు ఇండస్ట్రీకి స్పూర్తి ప్రదాతలు : బాలకృష్ణ
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళుర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ... కృష్ణ లేరన్న నిజం నమ్మలేకుండా వున్నామన్నారు. తెలుగు చిత్ర సీమకు కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారని... అన్ని జోనర్లలో సినిమాలు చేసి చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు. సుల్తాన్ సినిమా షూటింగ్ సమయంలో నాన్న గారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారని... ఎన్టీఆర్, కృష్ణలు చిత్ర పరిశ్రమకు స్పూర్తి ప్రదాతలని బాలయ్య కొనియాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com