చిరు వ్యాపారులకు ఆసరా.. 5 లక్షల మంది ఖాతాల్లోకి ‘‘జగనన్న తోడు’’ డబ్బులు

రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టింది. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని జగన్ వెల్లడించారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని... వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

తన సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని జగన్‌ చెప్పారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని... మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం అందజేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526.62 కోట్ల లబ్ధి చేకూరుతుందని జగన్ చెప్పారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని.. ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు.

More News

విద్యార్ధుల తరలింపుపై మోడీ ఫోకస్.. ఉక్రెయిన్ బోర్డర్‌‌కు నలుగు కేంద్ర మంత్రులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో విషాదం.. 102 ఏళ్ల యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు ఇకలేరు. ఆయన వయసు 102 సంవత్సరాలు.

రాధేశ్యామ్‌కు రాజమౌళి వాయిస్ ఓవర్... తెలుగు నుంచి హిందీ వరకు ఒక్కో స్టార్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘రాధేశ్యామ్’’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేసీఆర్ రాజకీయాలల్లో కీలకంగా ప్రకాశ్ రాజ్.. సడెన్‌గా ప్రశాంత్ కిషోర్ పక్కన ప్రత్యక్షం

తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో ఈ మధ్య సినీనటుడు ప్రకాశ్ రాజ్ కనిపిస్తుండటం సినీ, రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

నాగార్జున సినిమా అయినా.. పవన్ సినిమా అయినా మాకు ఒకటే: విమర్శలకు కొడాలి నాని కౌంటర్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి అవరోధాలు ఎదురైన సంగతి తెలిసిందే.