AP CM YS Jagan:జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం... ఇంటి వద్దే ఉచిత పరీక్షలు, మందులు  : సీఎం వైఎస్ జగన్

  • IndiaGlitz, [Saturday,September 30 2023]

రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసాను, భద్రతను కల్పించడమే ధ్యేయంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో కొత్త ఒరవడికి నాంది పలికామన్నారు. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 542 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు.

వైద్యం కోసం ప్రజలు అప్పుల పాలు కావొద్దు :

ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు వుండేలా చర్యలు చేపట్టామని. ఇక్కడ ఇద్దరు వైద్యులు, 104 వాహనం వుంటాయన్నారు. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్‌సీలో వుంటే, మరొకరు 104 ద్వారా తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తారని జగన్ తెలిపారు. ప్రతీ వైద్యుడు తనకు కేటాయించిన గ్రామాలను నెలలో రెండుసార్లు సందర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తద్వారా గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుందని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం విషయంలో టీడీపీ హయాంలో 1,056 ప్రోసీజర్స్ అందుబాటులో వుంటే.. దానిని మనం 3,256కి పెంచామని.. అలాగే గతంలో 915 నెట్‌వర్క్ ఆసుపత్రులుంటే, ఈ రోజు 2,200 పైచీలుకు ఆసుపత్రులు వున్నాయని సీఎం వెల్లడించారు. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఈ చర్యలు తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

ఇంటి వద్దే 7 రకాల పరీక్షలు :

ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతామని.. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తామని సీఎం వెల్లడించారు. మొత్తం ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో చికిత్స అందిస్తామని జగన్ పేర్కొన్నారు. క్యాన్సర్, డయాలసిస్ రోగులకు ఖరీదైన మందులను ఉచితంగా అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భాగస్వామ్యం అయ్యాయని జగన్ వెల్లడించారు.

More News

Bigg Boss 7 Telugu :  ప్రశాంత్‌పై నోరుపారేసుకున్న రతిక.. పవర్ అస్త్రతోనే సమాధానం చెప్పిన రైతు బిడ్డ

బిగ్‌బాస్ 7 తెలుగులో నాలుగో పవర్ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Womens Reservation:3 దశాబ్ధాల నిరీక్షణకు తెర .. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర , గెజిట్ నోటిఫికేషన్ విడుదల

దశాబ్థాలుగా భారతీయ మహిళలు కన కల ఇన్నాళ్లకు నెరవేరింది.. అసాధ్యం అనుకున్న దానిని మోడీ షా ద్వయం సుసాధ్యం చేసి చూపించింది.

CM YS Jagan:దోచుకోవడం, పంచుకోవడం నా విధానం కాదు.. త్వరలో కురుక్షేత్ర యుద్ధమే : సీఎం వైఎస్ జగన్

త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శుక్రవారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్

Nara Lokesh:ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : లోకేష్‌కు షాక్ .. బెయిల్ పిటిషన్‌ డిస్పోస్ చేసిన హైకోర్ట్, నోటీసులిచ్చేందుకు సీఐడీ రెడీ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

Engagement:'ఎంగేజ్మెంట్' చిత్రం షూటింగ్ పూర్తి..

సూరమ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ.. రోడియం ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం ఎంగేజ్మెంట్.