YS Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. గంటలోనే సమస్యకు పరిష్కారం..
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆపదలో ఉన్నామని వచ్చిన వారి వినతలు స్వీకరిస్తూ గంటల్లోనే పరిష్కారం చూపిస్తూ అండగా ఉంటున్నారు. తాజాగా భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి పలువురి సమస్యలను వినడంతో పాటు తక్షణమే వారిని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో గంటల వ్యవధిలోనే బాధితులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిష్కార మార్గం చూపించారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జిదారులకు జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డితో కలిసి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు సీఎంను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.9లక్షలు అందజేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె స్పష్టంచేశారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు..
- కడలి నాగలక్ష్మి: తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు
- ఎల్లమల్లి అన్నపూర్ణ: 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది
- చిల్లి సుమతి: బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం కోసం..
- కంతేటి దుర్గ భవాని: వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం చెక్కు అందజేయడం జరిగింది.
- తేతలి గీత: వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం
- అరుగుల లాజరస్: పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా.. కుమారునికి వైద్య సహాయం నిమిత్తం
- గుడాల అపర్ణ జ్యోతి: తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య సహాయం నిమిత్తం
- కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments