YS Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. గంటలోనే సమస్యకు పరిష్కారం..

  • IndiaGlitz, [Saturday,December 30 2023]

సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆపదలో ఉన్నామని వచ్చిన వారి వినతలు స్వీకరిస్తూ గంటల్లోనే పరిష్కారం చూపిస్తూ అండగా ఉంటున్నారు. తాజాగా భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి పలువురి సమస్యలను వినడంతో పాటు తక్షణమే వారిని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో గంటల వ్యవధిలోనే బాధితులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిష్కార మార్గం చూపించారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జిదారులకు జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డితో కలిసి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు సీఎంను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.9లక్షలు అందజేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె స్పష్టంచేశారు.

చెక్కులు అందుకున్న వారి వివరాలు..

  • కడలి నాగలక్ష్మి: తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు
  •  
  • ఎల్లమల్లి అన్నపూర్ణ: 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది
  •  
  • చిల్లి సుమతి: బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం కోసం..
  •  
  • కంతేటి దుర్గ భవాని: వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం చెక్కు అందజేయడం జరిగింది.
  •  
  • తేతలి గీత: వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం
  •  
  • అరుగుల లాజరస్: పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా.. కుమారునికి వైద్య సహాయం నిమిత్తం
  •  
  • గుడాల అపర్ణ జ్యోతి: తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య సహాయం నిమిత్తం
  •  
  • కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం అందజేశారు.

More News

BTech Ravi: నన్ను చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారు: బీటెక్ రవి

తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే తన గన్‌మెన్లను తొలగించారని మండిపడ్డారు.

Pawan Kalyan:జగన్ ప్రభుత్వం అవినీతిపై ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

ఏపీలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(PawanKalyan) ప్రధాని మోదీ(PM Modi)కి ఫిర్యాదుచేశారు.

Alla Ramakrishna Reddy:వైయస్ షర్మిల వెంటే నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల వెంట నడుస్తానని..

Producer Nattikumar:త్వరలోనే టీడీపీలో చేరతా: నిర్మాత నట్టికుమార్

తాను త్వరలోనే చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నట్లు సినీ నిర్మాత నట్టికుమార్ తెలిపారు.

Nagarjuna :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో నాగార్జున దంపతులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy)సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna), తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.