AP CM YS Jagan:సీపీఎస్ రద్దు .. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్, ఆడక్కుండానే ఉద్యోగులకు మరిన్ని వరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
రెండ్రోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ భేటీపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. రెగ్యులర్‌గా జరిగేదే కదా అనుకున్నారంతా. కానీ ఆ సమావేశం ముగిశాక జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు వైరల్ అయ్యాయి. ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా తన పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. దేశంలోని ఎన్నో ప్రభుత్వాలు ఓపీఎస్‌ని తీసుకొస్తామని చెబుతున్నప్పటికీ.. అవి అమల్లోకి రాలేదు. దీనిని ఎలా చేయాల్రా బాబు అనుకుంటున్న వేళ జగన్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. అయితే దీనిపైనా ఓ వర్గం మీడియా విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తోంది.
జీపీఎస్‌తో ఎన్నో ప్రయోజనాలు :
ఈ నేపథ్యంలో ఏపీ జీపీఎస్ వల్ల విద్యార్ధులకు లభించే ప్రయోజనాలను ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ గ్యారంటీగా లభిస్తుంది. గతంలో వున్న కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)తో పోలిస్తే జీపీఎస్ మెరుగైనదని ప్రభుత్వం చెబుతోంది. చూడటానికి సీపీఎస్ మాదిరే కనిపిస్తుంది.. కొత్త విధానంలో ఉద్యోగి వేతనంలో నుంచి 10 శాతం ఇస్తే, దానికి సమానమైన మొత్తంలో ప్రభుత్వం భరిస్తుంది. పదవీ విరమణ చేసే ముందే చివరి నెల వేతనంలోని బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుందని.. సీపీఎస్‌తో పోలిస్తే జీపీఎస్ ద్వారా అందే పెన్షన్ 150 శాతం అధికమని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుత ద్రవ్యోల్బణం, ధరలను దృష్టిలో వుంచుకుని కేంద్రం ప్రతి ఆరు నెలలకోసారి ప్రకటించే డీఏల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఏడాదికి రెండు డీఆర్‌లు ఇస్తుంది. దీని ప్రకారం పదవీ విరమణ పొందిన వ్యక్తి చివరి నెల వేతనం బేసిక్ రూ. లక్ష వుంటే అందులో 50 వేలు పెన్షన్‌గా ఉద్యోగులకు అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే 2 డీఆర్‌లతో కలిపితే .. ఇది పెరుగుతూ పోతుంది.
ప్రభుత్వ ఖజానాపై లక్ష కోట్లపైనే భారం :
ఉదాహరణకు .. ఓ ఉద్యోగి 62 ఏళ్ల వయసులో రిటైర్ అయితే, ఆ తర్వాత 20 ఏళ్లకు జీపీఎస్ విధానంలో పెన్షన్ రూ.1,10,000కి చేరుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉద్యోగికి పెన్షన్ అందుతుంది. జీపీఎస్ విధానాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 2070 నాటికి రూ.1,33,506 కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆడక్కుండానే ఉద్యోగాల క్రమబద్ధీకరణ:
ఇకపోతే.. కేవలం సీపీఎస్ రద్దు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే ఎన్నో నిర్ణయాలకు జగన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏళ్లుగా తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న వారకి కూడా జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసి, పాలిటెక్నిక్, విద్య, మెడికల్ , వైద్యం తదితర శాఖల్లో పెద్ద ఎత్తున సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి వారి పట్ల జగన్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి తమది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout