Tidco Houses:టిడ్కో ఇళ్లు : టీడీపీ చేసింది గోరంత, పబ్లిసిటీ కొండంత .. నిధులు, నిర్మాణాలు అన్నీ జగన్ వచ్చాకే
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి విపక్షాలు ఎన్నో ఆరోపణలు చేస్తుంటాయి. వీటిలో టిడ్కో ఇళ్లను పాడుబెడుతున్నారని, కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఇళ్లను జగన్ లబ్ధిదారులకు అందించడం లేదని మండిపడుతూ వుంటారు. అంతేకాదు.. విపక్షనేత చంద్రబాబు నాయుడైతే.. ఏకంగా టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్‌లు విసిరారు. తాము నిర్మించిన కారణం చేతనే జగన్ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకే కేటాయించడం లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ వుంటారు. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది పది పైసలు మాత్రమే.. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పగ్గాలు అందుకున్న తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణం పరుగులు పెట్టింది. వీటిని ఎవరు నిర్మించారు.. ఎవరు నిధులు కేటాయించారు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి.
300 అడుగుల ఇళ్లను ఉచితంగానే ఇచ్చిన జగన్ :
టిడ్కో ఇళ్లు పేదల పాలిట మహా సౌధాలుగా నిపుణులు అంటారు. చిన్న కుటుంబాలు నివసించేందుకు అనువుగా వీటికి రూపకల్పన చేశారు. వీటిని త్వరితగతిన తమకు కేటాయిస్తే పిల్లాపాపలతో కలిసి పాలు పొంగించాలన్నది ఎన్నో కుటుంబాల కల. గత టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించిన టిడ్కో ఇళ్ల బాధ్యతను జగన్ భుజానికెత్తుకున్నారు. పేదలకు తక్కువ ధరకే, ఇంకా చెప్పాలంటే 300 అడుగులున్న చిన్న ఫ్లాట్స్ ఐతే ఉచితంగానే ఇచ్చారు వైఎస్ జగన్ . మిగతా 365, 430 అడుగుల ఫ్లాట్స్ ను సగం ధరకే ప్రజలకు అందించింది వైసీపీ ప్రభుత్వం. టిడ్కో కాలనీల వద్ద తాగునీరు, రోడ్లు, విద్యుత్ ఇతర సౌకర్యాలకు సైతం భారీగా నిధులు విడుదల చేసిన జగన్.. లక్షలమంది కళ్లలో సంతోషాన్ని విరబూయించేందుకు సకలం సిద్ధం చేస్తున్నారు.
కరోనా సంక్షోభంలోనూ ఇళ్ల నిర్మాణం :
టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అంచనా వ్యయం రూ.28వేల కోట్లపైనే. కాని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుచేసింది సగం కంటే తక్కువేనని రికార్డులు చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటి వరకూ రూ.8,734 కోట్లు ఖర్చు చేసింది, కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఇప్పటికే 62,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతేకాదు.. టిడ్కో ఇళ్లు మురికికూపాలుగా మారిపోకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చుపెట్టింది. సీసీ రోడ్లు, సీవరేజిలను ఏర్పాటు చేసి అద్భుతమైన నివాస సముదాయాలుగా మార్చింది.
రిజిస్ట్రేషన్ ఖర్చులను భరించిన జగన్ :
అంతేకాదు.. గత తెలుగుదేశం ప్రభుత్వం బకాయిపెట్టిన బిల్స్ రూ.3 వేల కోట్లను కూడా తీర్చింది. చంద్రబాబు హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు ఋణం చెల్లించాలి. అంటే 21 ఏళ్ల తరువాత ఆ మొత్తం దాదాపు రూ. 7.2 లక్షలు అవుతుంది . అయితే ఆ 300 అడుగుల ఇంటిని వైయస్.జగన్ ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు అందిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం రూ. 5,340 కోట్లు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ప్రజలకోసం ఆ భారాన్ని భరిస్తోంది. అలాగే 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా ప్రభుత్వం భరించింది. దీని వల్ల ప్రభుత్వంపై పడే అదనపు భారం మరో రూ.482.31 కోట్లు. దీనికి తోడు ఉచిత రిజిస్ట్రేషన్ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
ఈ ఏడాది చివరినాటికి లబ్ధిదారుల చేతికి ఇళ్లు :
మొత్తం 1,43,600 మంది లబ్ధిదారులకు ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ మంజూరు చేశారు సీఎం జగన్. 365, 430 అడుగులతో కలిపి మొత్తం ఫ్లాట్స్ 2.62 లక్షలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరందరికీ సబ్సిడీల రూపంలో రూ. 14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు.. అలా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.18,714 కోట్లు . ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించిన ఇళ్లు 61,948 కాగా.. ఈ ఏడాది చివరి నాటికి అందించే ఫ్లాట్స్ 2,62,216.
సో.. ఇదీ వాస్తవం... ఈ ఏడాది చివరి నాటికి మొత్తం లబ్ధిదారుల ఇళ్లల్లో వెలుగులు నింపే లక్ష్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com