AP CM YS Jagan:పెత్తందార్లపై పేదల ప్రభుత్వం గెలిచింది .. ఇకపై ఇది "అందరి అమరావతి" : సీఎం వైఎస్ జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
అమరావతి ఇకపై అందరిదీ అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు సీఎం సోమవారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం వెంకటపాలెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్లు రాకుండా చంద్రబాబు , దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు చాలా కష్టపడ్డాయని ఆరోపించారు. ఇలాంటి దౌర్భగ్య స్థితి ఏపీలో తప్ప మరెక్కడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజని జగన్ వ్యాఖ్యానించారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ప్రత్యేకమైనదని.. శత్రువులపై సాధించిన విజయం అంటూ సీఎం పేర్కొన్నారు.
ఇళ్లు ఇవ్వకుండా 18 కేసులు వేశారు :
గత ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశారని.. కానీ ఆయన చేయని పనులను వైసీపీ ప్రభుత్వం చేస్తుంటే అడ్డు తగులుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్ట్ దాకా వెళ్లారని .. మొత్తం 18 కేసులు వేశారని సీఎం గుర్తుచేశారు. తాము మూడేళ్ల పాటు న్యాయ పోరాటం చేసి ఈ ఇళ్లు నిర్మించబోతున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే అడ్డుకున్నారని.. కానీ వారి పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించారని సీఎం ఎద్దేవా చేశారు. పేదలు బాగుపడితే చంద్రబాబుకు అస్సలు ఇష్టం వుండదని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
793 ఇళ్ల కోసం రూ.1370 కోట్లు :
పేదలకు ఇళ్లు నిర్మిస్తే అమరావతి రాజధాని అభివృద్ధి చెందదని ఎంతోమంది చెప్పారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే పేదల స్ధితిగతులు మారుతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నామని.. మొత్తంగా 793 ఇళ్ల నిమిత్తం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయమని.. రాక్షస బుద్ధి వున్న వారితో యుద్ధం చేస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout