కర్ఫ్యూ, బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో జగన్ కీలక నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కారణంగా ఏపీలో పలువురు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్ చికిత్సను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు నేడు ప్రకటించారు. ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు రెండు గంటలకు పైగా జరిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read: బిల్‌గేట్స్ దంపతులు విడిపోవడానికి ఆ మహిళే కారణమట..
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. పిల్లలకు ఆర్థికసాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. కాగా.. ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. దానినే కొనసాగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. సత్ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. వలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. అయితే కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయిందని జగన్ సమావేశంలో చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments