YS Jagan:ఎన్నికలకు ముందు జగన్ సంచలన నిర్ణయం.. అన్ని జిల్లాలకు కొత్త వర్గం, అధ్యక్షులు వీరే
- IndiaGlitz, [Friday,August 25 2023]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. అయితే అందరికంటే ముందే ఎన్నికల రణరంగంలోకి దిగేశారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్. వై నాట్ 175 అని పిలుపునిచ్చిన ఆయన.. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాలతో ఇంటింటికి వైసీపీ నేతలను చేరువ చేశారు. ఇదే సమయంలో ఎన్నికలకు సమర్ధులైన నేతలతో వెళ్లాలనుకుంటున్న ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాన్ని నియమించారు. కొత్త అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు , జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాల వారిగా వైసిపి నూతన అధ్యక్షులు:
శ్రీకాకుళం :ధర్మాన కృష్ణదాస్
విజయనగరం : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)
పార్వతీపురం మన్యం : శత్రుచర్ల పరీక్షిత్ రాజు
అల్లూరి సీతారామరాజు జిల్లా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి
అనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్
వెస్ట్ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాథరాజు
కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్
ఈస్ట్ గోదావరి : జక్కంపూడి రాజా
ఏలూరు : ఆళ్ల నాని
గుంటూరు : డొక్కా మాణిక్య వరప్రసాద్
కాకినాడ : కురసాల కన్నబాబు
కృష్ణా : పేర్ని నాని
కర్నూలు : వై బాలనాగిరెడ్డి
నంద్యాల : కాటసాని రామ్ భూపాల్ రెడ్డి
ఎన్టీఆర్ జిల్లా :వెల్లంపల్లి శ్రీనివాస్
పల్నాడు జిల్లా : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
తిరుపతి జిల్లా : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా : కె.సురేష్ బాబు
ప్రకాశం : జంకె వెంకటరెడ్డి
నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
సత్యసాయి జిల్లా : ఎం. శంకరనారాయణ
అనంతపురం : పైల నరసింహయ్య
అన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి
బాపట్ల : మోపిదేవి వెంకటరమణ
చిత్తూరు : కె ఆర్ జె భరత్