జగన్ కీలక నిర్ణయం.. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు, అసెంబ్లీలో ప్రకటన

ఇటీవల గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి మరణంపై ఏసీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని.. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని.. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని జగన్ అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని .. అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని జగన్ గుర్తుచేశారు.

పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని చెప్పారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ ప్రకటించారు.

More News

ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తా... సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు సినీ ప్రముఖులు.. సీఎం జగన్ సహా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు కూడా.

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్... దళితబంధుకు ప్రాధాన్యత, ఏ రంగానికి ఎంతంటే..?

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: బీజేపీకి షాక్.. సభ నుంచి ఈటల, రాజాసింగ్, రఘునందన్‌లు సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజే బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు‌లు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు

భీమ్లా నాయక్ రిలీజ్ నాడు జంతు బలి... పవన్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా తమ అభిమాన హీరోని పల్లెత్తు మాటంటే అస్సలు ఊరుకోరు.

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య. కొత్తదనం నిండిన కథలతో యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారాయన.