సస్పెన్స్‌కు తెర.. ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ప్రకటించిన జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని నెలలుగా ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఆర్సీపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 23.29 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ ఆయన వెల్లడించారు. దీనితో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతున్నట్లు జగన్ తెలిపారు. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే పెండింగ్ డీఏలు సైతం జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 30లోపు కారుణ్య నియామకాలు, అదే తేదీలోగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
అంతకుముందు 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నుంచి ఆయన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ఇచ్చిన హామీ మేరకు జగన్ ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments