చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఏపీ సీఐడీ అధికారులు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంపై చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న విచారణకు రావాలని చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు.
రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మరో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. రాజధాని సమాచారాన్ని ముందే తన అనుచరులకు ఇచ్చి.. వారి ద్వారా అసైన్డ్ భూములు కొనుగోలు చేయించారని కేసు నమోదైంది. అసైన్డ్ రైతులను మోసం చేసి తన అనుచరులకు లబ్ధి కలిగించారని చంద్రబాబుపై ఆరోపణలొచ్చాయి.
కాగా.. రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. అసైన్డ్ రైతులు మోసపోయి.. అనుచరులకు లబ్ధి కలిగించారని కేసు నమోదైంది. అయితే కేసు ఎవరు పెట్టారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout