Margadarshi:మార్గదర్శిలో నిబంధనల అతిక్రమణ.. రామోజీరావు, శైలజా కిరణ్‌లపై ఏపీ సీఐడీ కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల ఏపీలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలు, సివ్బంది ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో ఈ సంస్థ నిబంధలన ఉల్లంఘనలకు పాల్పడనట్లుగా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్ 34 కింద .. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం.. చిట్ ఫండ్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 76,79 ప్రకారం ఈ ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. ఏ 1 నిందితుడిగా రామోజీరావు, ఏ2గా శైలజ, ఏ3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లను చేర్చింది.
రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదుతో సీఐడీ సోదాలు :
అయితే ఏయే బ్రాంచ్‌లలో మార్గదర్శి సంస్థ ఉల్లంఘనలకు పాల్పడిందనే దానిపై సీఐడీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మార్గదర్శిపై ఆరోపణలు వున్నట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. నిధుల మళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో సీఐడీ ఈ మేరకు రంగంలోకి దిగింది. గతంలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఫిర్యాదు మేరకు విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరులలో సీఐడీ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com