4గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

  • IndiaGlitz, [Wednesday,October 30 2019]

ఒకట్రెండు కాదు సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఓకే చెప్పింది. కాగా ఈ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఈ భేటికి సంబంధించిన వివరాలను నిశితంగా వెల్లడించారు.

కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ..!

జగనన్న అమ్మఒడి పథకం కింద ప్రతీ సంవత్సరం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న తల్లులకు రూ.15 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కావాల్సిన ఆర్థిక వనరులను సుమారు రూ.6455 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

గర్భవతులు, బాలింతలు ఆరు నెలల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ గుర్తించబడిన 77 మండలాల్లో అదనపు పౌష్టికాహారాన్ని అమలు చేయాలని నిర్ణయం.

కృష్ణా, గోదావరి నదుల ద్వారా ప్రవహించే అన్ని పంట కాల్వలను శుద్ధి చేయాలని కృష్ణ, గోదావరి కాల్వల శుద్ధి మిషన్‌ ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది.

రాష్ట్రంలోని షెడ్యుల్డ్‌ కులాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను మూడుగా విభజించాలని, మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర షెడ్యుల్డ్‌ కులాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ఆమోదించింది.

వివిధ రంగాల ద్వారా ప్రజా సేవలు అందించే ప్రతిభావంతులకు వైఎస్సార్‌ లైఫ్‌ టైం అవార్డులను అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

హజ్‌ యాత్రికుల కోసం, జెరూసలెం యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని మూడు లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి రూ.60 వేలు, 3 లక్షలకు పైబడి ఉన్న వారికి రూ.30 వేలకు పెంచాలని మంత్రి మండలి తీర్మానించింది.

కంకర పరిశ్రమలను గుర్తించి ప్రభుత్వం జీఓ ఇచ్చిన ఆరు నెలలోపు కంకర నుంచి రోబో శాండ్‌ తయారు చేయడానికి మిషినరీ మెరుగుపరుచుకోవడానికి ఎవరు ముందుకు వస్తారో వారికి అదనంగా రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పావలా వడ్డీకే రుణం అందించాలని, అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే 50 కిలోమీటర్ల పరిధిలో యూనిట్‌ ఉంటే 20 శాతం వాడే విధంగా చర్యలు.

అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో 300 గజాల వరకు ఇళ్లు నిర్మించుకున్నా రెగ్యూలరైజ్‌ చేయాలని కేబినెట్‌ ఆమోదించింది. తెల్ల రేషన్‌ కార్డు ఉండి వంద గజాల లోపు ఇళ్లు నిర్మించుకొని ఉంటే రూ.1 రిజిస్ట్రేషన్‌ చేసి రెగ్యులరైజ్‌ చేయాలని, బీపీఎల్‌ కుటుంబాలు అయితే వంద నుంచి 3 వందల గజాల్లో ఇళ్లు కట్టుకుంటే ఆ ఇళ్లకు రిజిస్టార్‌ ఆఫీస్‌లో ఉన్న మార్కెట్‌ ధరను జిల్లా కలెక్టర్లు నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేస్తారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 397 అదనపు జేఎల్‌ఎం పోస్టులను ఆమోదించింది.

గత ప్రభుత్వాల దోష నిర్ణయాల వల్ల ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఊరట కలిగిస్తూ ఆమోదం.

హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం.

రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సాంకేతికంగా అండదండగా ఉండేందుకు ప్రతి గ్రామీణ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ అగ్రి ల్యాబ్‌ ఏర్పాటు.

9 కోస్తా జిల్లాల్లోని 46 నియోజకవర్గాల్లో ఆక్వాల్యాబ్‌ల ఏర్పాటుకు తీర్మానం.

విభజన తరువాత రాజ్‌భవన్‌ మొదటి సారిగా రాజధానిలో ఏర్పాటు చేయడం వల్ల తాత్కాలిక పద్ధతిలో 35 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం.

న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించి చట్టంలో మార్పు చేయాలని నిర్ణయం. గతంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి వచ్చే రూ. 2ను రూ. 20గా మార్చాలని తీర్మానించింది.

నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 130కిపైగా ఆస్పత్రుల్లో 716 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద అర్హులైనవారికి సేవలు ప్రారంభమవుతాయి.

నవంబర్‌ 7వ తేదీన అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ 20 వేల లోపున్న డిపాజిట్‌దారులందరికీ డబ్బులు చెల్లించడానికి నిర్ణయం. తొలుత రూ.10 వేల లోపు ఉన్నవారికి డబ్బులు ఇస్తాం. దీనికి రూ.264 రిలీజ్‌ చేయడం జరిగింది. 3,69,650 మందికి దీని ద్వారా లబ్ధిచేకూరుతుంది.

నవంబర్‌ 14వ తేదీన స్కూల్స్‌లో నాడు-నేడు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న స్కూల్‌ ఫొటో తీసి.. మూడు నాలుగు సంవత్సరాల తరువాత అభివృద్ధి చేసిన ఫొటో కూడా చూపిస్తాం.

21న మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేత గుర్తింపబడిన 80 పైచిలుకు డీజిల్‌ బంకుల్లో లీటర్‌కు రూ. 9 సబ్సిడీ బంకులోనే అందించేలా నిర్ణయం.

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా అనే వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని, తీవ్రమైన పక్షవాతం, కండరాల హీనతతో మంచానపడిన వారికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయం.

కిడ్నీ వ్యాధి గ్రస్తులు (డయాలసిస్‌ స్టేజ్‌ 2, 3, 4) నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం.

ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు ఉంటే విశ్రాంతి సమయంలో రోజుకు రూ. 200 ఇవ్వాలని, నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం రూ. 8 వేల వేతనాన్ని రూ.16 వేల వేతనం ఇవ్వాలని తీర్మానించినట్లు మంత్రి పేర్ని నాని మీడియా ద్వారా వెల్లడించారు.

More News

మోదీ సంచలన నిర్ణయం.. బంగారం లెక్కలు చెప్పాల్సిందే!

దేశంలో నల్లధనం నిర్మూలనకు మూడేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ.. భూముల అప్పగింతపై చర్చ

తెలంగాణ మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు.

రవితేజ రెమ్యూనరేషన్ పై నిర్మాత మెలిక

మాస్ మ‌హారాజా ర‌వితేజ 66వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

లోకేష్‌ను పప్పు అంటారా.. అబ్బే నాకు తెలియదే!?

వివాదాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన.. వివాదాలే ఊపిరిగా భావించే రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’

పోటీని అంగీకరించని మహేష్ బాబు

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ రానున్న సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వ‌రు` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.