ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం.. ఏప్రిల్ 4 నుంచి పాలన ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి వర్చువల్ సమావేశంలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
పలు చోట్ల కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు వచ్చాయి. వీటిని పరిగణనలోనికి తీసుకున్న ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. అలాగే పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం , ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్లు, ధర్మవరం, పుట్టపర్తి , రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వీటికి వర్చువల్ ద్వారా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 4న ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాలు ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ సయంలోనే 26 జిల్లాలను స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు చేపట్టాలని, అప్పటి నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout