AP Budget: 2 లక్షల 79 వేల కోట్లతో ఏపీ బడ్జెట్.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2 లక్షల 79 వేల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా.. ఇందులో రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం 31,061 కోట్లు , ద్రవ్య లోటు 54,587 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్య లోటు 1.54 శాతంగా బుగ్గన వెల్లడించారు.
ఏపీ బడ్జెట్ హైలైట్స్ :
వ్యవసాయ శాఖకు రూ. 11589.48 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు
ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ- రూ. 9,118.71 కోట్లు
విద్యుత్ శాఖ- రూ. 6546.21 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్- రూ. 29,690.71 కోట్లు
వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు
ఈబీసీ కార్పొరేషన్- రూ. 6165 కోట్లు
కాపు కార్పొరేషన్- రూ. 4887 కోట్లు
క్రిస్టియన్ కార్పొరేషన్- రూ. 115.03 కోట్లు
ఎస్సీ కార్పొరేషన్- రూ. 8384.93 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్- రూ. 2428 కోట్లు
బీసీ కార్పొరేషన్- రూ. 22,715 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు
మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ-రూ.50 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
లా నేస్తం-రూ.17 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ రూ. 1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
పేదలందరికీ ఇళ్లు పథకానికి -రూ.5,600 కోట్లు
ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు
వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి -రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా పథకానికి -రూ.6700 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
ఎనర్జీ- రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి- రూ.532 కోట్లు
మనబడి నాడు-నేడు పథకానికి -రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక పథకానికి - రూ.560 కోట్లు
పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments