ఏపీ బీజేపీకి కొత్త బాస్ ఈయనే.. పవన్ నిర్ణయమే!?
Send us your feedback to audioarticles@vaarta.com
యావత్ భారతదేశ వ్యాప్తంగా కమలాన్ని వికసింపచేయాలని ఢిల్లీ కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో రాష్ట్రంలో కాషాయ జెండాన్ని ఎగురవేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కీలకంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని బీజేపీ పెద్దలు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను నియమించడం జరిగింది. అయితే త్వరలోనే ఏపీ బీజేపీకి కొత్త బాస్ వచ్చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మాధవే బాస్!
వాస్తవానికి.. ఈ పదవి కోసం విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, మాధవ్, మాణిక్యాలరావు, దగ్గుబాటి పురందేశ్వరి.. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారు. రెండో టెర్మ్ కూడా తానే ఉండాలని కన్నా లక్ష్మీ నారాయణ కూడా భావిస్తున్నారు. అయితే.. వీరిలో ఎమ్మెల్సీ మాధవ్‌ను ఏపీ బాస్‌గా నియమించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మాధవ్‌కే ఇవ్వడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే.. మాధవ్ ఎంతమంది పార్టీ మారినా విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ఆయన బీజేపీలో కీలకంగా ఉన్నారు. అంతేకాదు.. ఆయన తండ్రి పీవీ చలపతి బీజేపీకి చెందిన వ్యక్తే. గతంలో 1980లో జనతా పార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు చలపతి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన విషయం తెలిసిందే.
పవన్ నిర్ణయమేనా..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు కలిసి కీలక సమావేశం కావడం.. ఢిల్లీలో సైతం మరోసారి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ అండ్ కలమనాథులు సమావేశం కావడం.. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించడం.. వైసీపీని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపై నిశితంగా చర్చించారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ-జనసేన.. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ అధ్యక్షుడ్ని కన్నా కాకుండా మరొకర్ని మార్చాలని ఎప్పట్నుంచో ఢిల్లీ కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ అధ్యక్షుడి ఎంపిక బాధ్యతలను పవన్ తీసుకోవాలని.. ఆ కీలక పదవిలో మంచి పట్టున్న నేతను నియమించాలని ఢిల్లీ నుంచి పెద్దలు జనసేనానిని ఆదేశించారట. ఈ క్రమంలో ఆ పదవి ఎవరికి కట్టెబెట్టాలా అని పవన్ నిశించి ఆలోచించి మాధవ్ పేరును ఢిల్లీ పెద్దలకు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments