సినీ ఇండస్ట్రీకి రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన ఏపీ..
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమే. ఆ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేటర్స్ మూత పడ్డాయి. దీంతో సినీ కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చేసిన కృషి కారణంగా.. ఇటీవల థియేటర్స్‌ను యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చునని ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే ఎగ్జిబిటర్స్ థియేటర్స్‌ను తెరవలేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. దీని ప్రకారం.. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లూ చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. అలాగే ఆ తదుపరి నెలలకు వాయిదాల వారిగా కట్టుకునేలా సౌకర్యం కల్పించాలని భావించింది.
అయితే వెంటనే థియేటర్స్ ఓపెన్ చేసేందుకు రీస్టార్ట్ ప్యాకేజ్ పేరుతో ఏ, బీ సెంటర్ థియేటర్లకు రూ. 10 లక్షలు, సీ సెంటర్ థియేటర్లకు 5 లక్షల చొప్పున రుణాలు ఇప్పించాలని యోచిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు. వాయిదాల చెల్లింపులపై 6 నెలలు మారిటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments