APSSCResults2022 : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల.. ప్రకాశం ఫస్ట్, అనంతపురం లాస్ట్

  • IndiaGlitz, [Monday,June 06 2022]

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. 2,02,821 మంది బాలురు పాసైతే.. 2,11,460 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 67.26 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవ్వగా.. ఇందులో బాలురు 64.02 శాతం, బాలికల్లో 70.70 శాతం మంది పాసయ్యారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా (78.30 శాతం) ప్రథమ స్థానంలో వుండగా.. అనంతపురం జిల్లా (49.70 శాతం) చివరి స్థానంలో నిలిచింది.

71 పాఠశాలల్లో ఉత్తీర్ణత ‘సున్నా’ :

రాష్ట్రంలో 11,671 పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వీటిలో 797 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. 71 పాఠశాలల్లో ‘సున్నా’ శాతం అంటే ఎవ్వరూ పాసవ్వలేదు. వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రేపటి నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుందని.. ఈ నెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నామని బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్ధులతో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

నిజానికి శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విద్యార్ధులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.

More News

భాగ్యనగరంలో బోనాల జాతరకు ముహూర్తం ఖరారు.. తేదీలు ఇవే, నెల రోజులూ పండుగే

హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పర్వదినాల్లో బోనాలు ఒకటి.

Pawan Kalyan: సీఎం అభ్యర్ధిగా పవన్‌ని ప్రకటించండి .. జేపీ నడ్డాను కోరిన జనసేన నేత పోతిన మహేశ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్.

జగన్ మదిలో ముందస్తు ఆలోచన.. కోనసీమలో చిచ్చు వైసీపీ కుట్రే : నాదెండ్ల మనోహర్

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రభుత్వం ఆరాటపడుతోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజాబలం లేక, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే దారి లేక కులాల మధ్య చిచ్చు పెట్టాలని

Nadendla Manohar: ఇగోలోద్దు.. పవన్‌ను సీఎంగా చూడాలంటే కష్టపడండి : శ్రేణులకు నాదెండ్ల దిశానిర్దేశం

పార్టీ నిర్మాణమంటే సామాన్యమైన విషయం కాదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక వ్యక్తితో అది సాధ్యం కాదని.. సమష్టిగా కష్టపడితేనే పార్టీని అద్భుతంగా నిర్మించుకోగలమని

Pawan kalyan: ఈసారి వాళ్లు తగ్గాల్సిందే.. నా మూడు ఆప్షన్స్ ఇవే : పొత్తులపై పవన్ కామెంట్స్

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..