10th class Results:ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి, పార్వతీపురం జిల్లా టాప్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎప్పటిలాగే ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 69.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత 5 శాతం పెరిగిందని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలోని 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణాత సాధించారని.. 38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. మన్యం జిల్లా 87.47 ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
జూన్ 2 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ :
ఇకపోతే.. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్ధులు మే 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకుని పరీక్ష ఫీజు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బొత్స చెప్పారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్ధులు ఈ నెల 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని తెలిపారు.
నెల రోజుల్లోనే రిజల్ట్స్
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. 6,05,052 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవ్వగా.. వీరిలో 3,09,245 మంది బాలురు.. 2,95,807 మంది బాలికలు హాజరయ్యారు. కేవలం నెల రోజుల్లోనే పరీక్షా ఫలితాలను విడుదల చేయడం విశేషం:
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments