అనుష్క లుక్ కూడా వచ్చేస్తుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `ఓం నమోవెంకటేశాయ`. వెంకటేశ్వరుని భక్తుడు హథీరాంబాబా జీవిత కథను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. సౌరభ్ జైన్ ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామిగా కనిపిస్తున్నారు.
అనుష్క, విమలారామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన వెంకటేశుని ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న అనుష్క పాత్రకు సంబంధించిన లుక్‌ను ఆగస్ట్ 6న విడుదల చేయడానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments