చిరుతో అనుష్క...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందనుంది. ఓ మెసేజ్‌తో కూడిని కమర్షియల్ సినిమాలను అందించే దర్శకుల్లో.. కొరటాల శివ ఒకరు. ఇప్పుడు మెగాస్టార్‌ని కూడా అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రంలో చూపించడానికి కథను సిద్ధం చేశాడు కొరటాల.
తాజా సమాచారం ప్రకారం కొరటాల ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. భాగమతి సక్సెస్ తర్వాత అనుష్క మరో సినిమాలో నటించలేదు. బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. చిరంజీవి సినిమాతోనే మళ్లీ తెరపై కనపడే అవకాశాలున్నాయి. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ నుండి ప్రారంభం అవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com