ముగాంబికను దర్శించుకున్న అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరైన అనుష్క ఇప్పుడు ఓ రకంగా వివిఐపి స్టేటస్‌ను అనుభవిస్తుందనుకోవాలి. అందుకు కారణం బాహుబలి-2. దేవసేనగా బాహుబలి-2లో మెప్పించిన అనుష్క బయట మాత్రం చాలా డీసెంట్‌గా కనపడతుంది. సినిమా సక్సెస్ కావడమో, ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవాలనుకుందో ఏమో కానీ అనుష్క కర్ణాటకలోని మూకాంబిక ఆలయాన్ని తన కుటుంబంతో కలిసి దర్శించుకుంది.
అయితే విఐపి హోదాలో కాకుండా సాధారణ భక్తుల తరహాలో క్యూలో నిలబడి పూజ ముగించింది జేజెమ్మ. అనుష్కకు దైవభక్తి ఎక్కువ. చాలా కాలం తర్వాత బెంగళూరు రావడంతో స్వీటీ ముకాంబిక దర్శించుకుందని ఆమె తండ్రి విఠల్ శెట్టి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments