అనుష్క క్వీన్ గా చేయనంది..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ క్వీన్‌గా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను దక్షిణాదిన రీమేక్ చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. తమిళ సీనియర్ నటుడు, నిర్మాత అయిన త్యాగరాజన్ ఈ రీమేక్ సినిమాల్లో భాగంగా ఉన్నాడు. కానీ దక్షిణాదిన క్వీన్ పాత్ర చేయడానికి మంచి హీరోయిన్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు నిర్మాతలు.
నిజానికి కన్నడ రీమేక్ వెర్షన్లో పారుల్ యాదవ్ నటిస్తుంటే, తెలుగు, తమిళంలో ముందు ఈ పాత్రను తమన్నా చేయాలనుకుంది, కానీ సినిమా ప్రారంభం కాక మునుపే చేయనని తప్పుకుంది. తర్వాత నిర్మాతలు అనుష్క శెట్టిను సంప్రదించారట. కానీ అనుష్క మంచి కథ, క్యారెక్టర్ అయినా తాను చేయలేనని చెప్పేసిందట. అందుకు కారణం కంగనా నటనతో, తన నటనను ప్రేక్షకులు పోల్చి చూస్తారని దాని వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని అనుష్క సినిమా చేయనందట. ఇప్పుడు క్వీన్ పాత్రలో కాజల్ అగర్వాల్ మెరనుంది. ఈ సినిమాలో ఎమీ జాక్సన్ కూడా చేయనుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com