నలుగురు స్టార్స్ తో అనుష్క...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. శివపుత్రడు, వాడు వీడు, నేను దేవుణ్ని వంటి చిత్రాలతో తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు బాల తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేశాడు.
ఈ చిత్రంలో అనుష్క నలుగురు స్టార్‌లతో కలిసి నటించనుందట. విశాల్, ఆర్య, రానా, అరవింద్ స్వామిలు ఈ చిత్రంలో నటిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయి. మరి బాల ఈ చిత్రంలో ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తాడో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments