చంద్రముఖి -2 లో అనుష్క..
Saturday, May 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార కాంబినేషన్లో రూపొందిన చంద్రముఖి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. చంద్రముఖి చిత్రానికి డైరెక్టర్ పి.వాసు సీక్వెల్ తీయాలనుకున్నారు. కానీ..కుదరలేదు. ఇదిలా ఉంటే...ఇటీవల కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా పి.వాసు శివలింగ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయడానికి పి.వాసు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, అనుష్క జంటగా నటించనున్నట్టు సమాచారం. చంద్రముఖి చిత్రంలో నటించిన వడివేలు ఈ చిత్రంలో కూడా నటిస్తున్నాడట. అయితే...ఈ చిత్రానికి చంద్రముఖి 2 అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. చంద్రముఖి 2 అని టైటిల్ పెడితే...ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ రావడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments